Crimejournalist

Feb 23 2024, 07:26

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు




•చలివేంద్రాన్ని ప్రారంబించిన ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు •


జయశంకర్ భూపాలపల్లి జిల్లా:



(మొగుళ్ళపల్లి ):- మండలంలోని ముల్కలపల్లి- మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ బి ఐ మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా..మంచినీటి సమస్య తలెత్తకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సమస్యను తీరుస్తున్న ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది ఓదెలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, ఎండి రఫీ, యూత్ కాంగ్రెస్ మొగళ్లపల్లి మండల అధ్యక్షులు నీల రాజు కురుమ, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 08:15

ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ ఏసిపి బాలాజీ

ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు

సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]


(గజ్వేల్ ):- గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు వేగంగా వస్తున్నాయని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గజ్వేల్ ఏసీపీ బాలాజీ కి తెలపగా ఏసిపి బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి స్థలాన్ని సందర్శించి స్పీడ్ బ్రేకర్, గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఇచ్చిన మాటను 24 గంటల్లోపే అమలు చేసిన గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బాలాజీ గారికి గజ్వేల్ బార్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ జాయింట సెక్రెటరీ ఎన్నెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 22 2024, 07:50

పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన బేగంపేట నూతన ఎస్ఐ



సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist ]

• బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు •

సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవి కాంత్ రావు,మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ ఎస్ఐ.ను అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

Crimejournalist

Feb 22 2024, 07:24

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నామకరణం చేయాలనీ ప్రధాని మోడీకీ ఉత్తరం


©హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నామకరణం చేయాలనీ ప్రధాని మోడీకీ ఉత్తరం వేసిన - ప్రముఖసామాజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు©


సిద్దిపేట జిల్లా:



[ Streebuzz news Crime journalist ]



(సిద్దిపేట జిల్లా 21-ఫిబ్రవరి):- హుస్నాబాద్ పోస్టాఫీస్ కార్యాలయం: భారత దేశంలో ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయానికీ(హైదరాబాద్ శంషాబాద్) భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిడిశెట్టి రాజు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిదంగా భారతప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్, తెలంగాణ రాష్ట్ర సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి లకులేఖ ద్వారా విజ్ఞప్తి చేశానని చెప్పారు.ఇటీవల భారత అత్యున్నత పురష్కారం భారతరత్న ప్రకటించిన సందర్బంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం ఆని, మేధావుల్లారా విద్యావంతులారా ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజు పేర్కొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో జన్మించిన ఆర్థిక సంస్కరణల పీతామాహుడు, బాహుబషా కోవిధుడు, మహనీయులు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఇట్టి విషయం పై ప్రతి ఒక్కరూ స్పందించాలనీ అన్నారు . ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు నమిలికొండ ఐలయ్య,గంగాధర్ రమేష్,పెనుకుంట్ల రాజ్ కుమార్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 21 2024, 13:41

గొల్ల,కురుమల రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం వసూలు చేసిన DD లను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ జిల్లా అధ్యక్షుడుకందూరిఅయిలయ్య


సిద్దిపేట జిల్లా:

[ Streebuzz news Crime journalist]

(కుకునూర్ పల్లి ):- గత ప్రభుత్వ హయాంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కోసం రెండో విడత గొర్రెల పంపిణీ అందజేస్తామని చెప్పడంతో అప్పులు చేసి డీడీలు కట్టిన గొల్ల కురుమలకు నిరాశ ఎదురైందని సిద్దిపేట జిల్లా బీసీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామం పంచాయతీ ఆవరణలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కందూరు ఐలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడుదల సజావుగా అందజేసిందన్నారు. రెండో విడత పంపిణీ కొరకు గొల్ల కురుమల నుండి ఒక్క యూనిట్ కి , ఒక్కొక్కరికి 43,750 రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల ను ప్రభుత్వం DD ల రూపంలో వసూలు చేసిందని తెలిపాడు.గొర్రెలు వస్తాయని తమ కుల వృత్తి పనిలో తాము అభివృద్ధి చెందుతామని ఆశపడ్డ వాళ్లకు ఇప్పటికీ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడంతో నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటి ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకొని గొల్ల కురుమలకు న్యాయం జరిగేలా వెంటనే గొల్ల కురుమల DD లు కట్టిన డబ్బులను వారి వారికి అందజేయాలని కోరాడు.ఈ కార్యక్రమంలో లకుడారం గ్రామానికి చెందిన గొల్ల కురుమ సంగెం సభ్యులు పాల్గొన్నారు .

Crimejournalist

Feb 21 2024, 08:59

గజ్వేల్ కోర్టును సందర్శించి పెండింగ్ లో ఉన్న ట్రయల్ కేసుల గురించి వచ్చే నెల జరుగు లోకదాలత్ ల గురించి చర్చించిన ఏసిపి బాలాజీ


సిద్దిపేట జిల్లా:


[ Streebuzz news Crime journalist ]


(గజ్వేల్ 20-పిబ్రవరి):- గజ్వేల్ ఏసిపి బాలాజీ మంగళవారం కోర్టును సందర్శించి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడమ్ వి సౌమ్య, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేడమ్ ప్రియాంక, గార్లను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న ట్రయల్ కేసుల గురించి వచ్చేనెల తొమ్మిదిన జరుగు లోకదాలత్ గురించి చర్చించుకున్నారు.గజ్వేల్ బార్ అసోసియేషన్ సభ్యులు గజ్వేల్ కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు వేగంగా వస్తున్నాయని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఏసీపీ గారికి తెలపగా ఏసిపి బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి స్థలాన్ని సందర్శించి స్పీడ్ బ్రేకర్, గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Crimejournalist

Feb 21 2024, 08:38

పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసిపి

సిద్దిపేట జిల్లా:



[Streebuzz news crime journalist]


(గజ్వేల్ 20-పిబ్రవరి ):- గజ్వేల్ ఏసిపి బాలాజీ తన కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు పెండింగ్ ఉన్న కేసుల గురించి సంబంధిత ఎస్ఐ సీఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ పారదర్శకంగా కేసుల దర్యాప్తు ఉండాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ప్రతి అధికారి తప్పకుండా సంఘటనా స్థలాన్ని సందర్శించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా కేసులను చేదించి త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసులలో ఎలాంటి జాప్యం లేకుండా 60 రోజులలో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. సైబర్ నేరాల గురించి, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి గ్రామాలలో పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా నిరంతరం నిఘా పెంచాలని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా కేసుల ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, తొగుట సిఐ లతీఫ్, తొగుట ఎస్ఐ లింగం, బేగంపేట ఎస్ఐ రవికాంత్ రావు, ములుగు ఎస్ఐ విజయ్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 21 2024, 08:25

గజ్వేల్ ఏసిపి బాలాజీ ని కలిసి తమ సమస్యలు చెప్పి సన్మానించిన ఆటో యూనియన్ ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు

సిద్దిపేట జిల్లా:

Street Buzz Crime journalist:


(గజ్వేల్ 20- ఫిబ్రవరి):- ప్రజ్ఞాపూర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు కార్యవర్గ సభ్యులు మంగళవారం కలసి గజ్వేల్ ఏసిపి బాలాజీ ని ఏసీపీ కార్యాలయంలో కలసి వారిని సన్మానించారు. అనంతరం వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Crimejournalist

Feb 21 2024, 08:01

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 150మంది విద్యార్థినులకు సైకిల్లు పంపిణీ


streebuzz crime journalist




సిద్దిపేట జిల్లా:



(ములుగు 20-పిబ్రవరి): - సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి లో 150 మంది విద్యార్థినులకు రోటరీ క్లబ్ గజ్వేల్ ఆధ్వర్యం లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఎసిపి బాలాజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవలో రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయం అని ఈ సంస్థ ద్వారా విద్యార్థినులకు 150 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అని ఆయన కొనియడారు.విద్యార్థినిలు అసాంఘిక శక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని,మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరకోవాలనీ ఎసిపి బాలాజీ అన్నారు. రోటరీ క్లబ్ రీజియన్ హెడ్ రవి వడ్లమను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోటరీ క్లబ్ ద్వారా మరింత సేవలు చేయాల్సిన అవసరం ఉందని, గజ్వేల్ రోటరీ క్లబ్ ద్వారా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని రవి వడ్లమని అన్నారు.ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు , గజ్వేల్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 20 2024, 08:46

ప్రశాంతంగా ముగిసిన ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ







Streetbuzz News Crime journalist


సిద్దిపేట జిల్లా:



(గజ్వేల్ 19-పిబ్రవరి ):- గజ్వేల్ చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోమవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీ కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు, మరియు సీసీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షించిన అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ యస్. మల్లారెడ్డి, గజ్వేల్ ఏసిపి బాలాజీ, ర్యాలీ గజ్వేల్ రామాలయం టెంపుల్ నుండి మార్కెట్ హనుమాన్ టెంపుల్, ఇందిరా పార్క్, బస్టాండ్, అంబేద్కర్ స్టాచ్, పిడిచెడు రోడ్డు శివాజీ విగ్రహం వరకు కొనసాగింది. ప్రశాంతంగా ముగిసిన ర్యాలీ.పర్యవేక్షించిన పోలీస్ అధికారులు అడిషనల్ డిసిపి లాండ్ ఆర్డర్ ఎస్ మల్లారెడ్డి, గజ్వేల్ ఏసిపి బాలాజీ, గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది.